నడిరేయిలో పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సత్తా ఉన్న ఈ క్షిపణిని.. శుక్రవారం ఒడిశా బాలాసోర్లోని చాందీపుర్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించింది భారత సైన్యం. లాంచ్ కాంప్లెక్స్-3 నుంచి ఓ మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని డీఆర్డీఓ పర్యవేక్షించింది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని.. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్ల ద్వారా పరిశీలించామని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 24న, గతేడాది నవంబర్ 20న పృథ్వీ క్షిపణిని చీకటిలోనే పరీక్షించారు.
సత్తా అదుర్స్..