తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు పాక్​ మానుకోవాలి'​

కశ్మీర్​ అంశంపై పాకిస్థాన్​ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది భారత​ విదేశాంగ శాఖ. భారత్​కు సంబంధించిన అంశాల్లో ఉగ్రవాదమే తమ విధానమన్నట్లు పాక్​ వ్యవహరిస్తోందన్నారు విదేశాంగ ప్రతినిధి రవీశ్​కుమార్.. కశ్మీర్​ విషయంలో జిహాద్​ చేయాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు.

పాకిస్థాన్​ బాధ్యతారహిత్య వ్యాఖ్యలను ఖండించిన భారత్​

By

Published : Aug 29, 2019, 7:35 PM IST

Updated : Sep 28, 2019, 6:47 PM IST

భారత అంతర్గత అంశమైన కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దుపై పాకిస్థాన్ చేస్తోన్న​ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను కొట్టిపారేశారు విదేశాంగ ప్రతినిధి రవీశ్ ​కుమార్. భారత్​తో సంబంధాల విషయంలో ఉగ్రవాదమే తమ విధానమన్నట్లు పాక్ వ్యవహరిస్తోందని​ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలని సూచించారు.

కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్​ ప్రధాని జిహాద్‌కు పిలుపునివ్వడం, భారత్​లో హింసను సృష్టించాలన్న వ్యాఖ్యలను తప్పుపట్టారు రవీశ్​.

పాకిస్థాన్​ బాధ్యతారహిత్య వ్యాఖ్యలను ఖండించిన భారత్​

"భారత అంతర్గత వ్యవహారాలపై పాకిస్థాన్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యమైనవి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పాక్​ చేస్తోన్న వ్యాఖ్యలు క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి... అసత్యాలతో కూడిన విద్వేషపూరితమైన పాక్ వ్యాఖ్యలను ప్రపంచం గమనిస్తోందన్న విషయాన్ని దాయాది దేశం గుర్తించాలి. తమ గగనతలాన్ని మూసేస్తున్నామని అంతర్జాతీయ మానవ హక్కుల అధ్యక్షుడికి పాక్ రాసిన లేఖను కొట్టిపారేస్తున్నాం. ఆ లేఖ రాసేందుకు ఉపయోగించిన కాగితపు విలువ కూడా ఆ అంశానికి లేదు."

-రవీశ్​కుమార్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి

ఇదీ చూడండి: హరియాణా: టోల్​ప్లాజా ఉద్యోగినిపై డ్రైవర్​ దాడి

Last Updated : Sep 28, 2019, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details