తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మందుల వాడకంపై ఐరాస తీర్మానానికి భారత్​ మద్దతు - కరోనా వైరస్​ వార్తలు

ప్రపంచ వ్యాప్తంగా మందుల పంపిణీలో పారదర్శకత ఉండాలని, అన్ని దేశాలు సమానంగా వినియోగించుకోవాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్​ మద్దతు పలికింది. భవిష్యత్​లో అభివృద్ధి చేసే కరోనా వ్యాక్సిన్​ను న్యాయంగా వినియోగించుకోవాలన్న ఐరాసను అభిప్రాయాన్ని సమర్ధించింది.

India co-sponsors resolution calling for equitable access to COVID-19 vaccines
మందుల వాడకంపై ఐరాస తీర్మానానికి భారత్​ మద్దతు

By

Published : Apr 22, 2020, 5:46 PM IST

కరోనా వైరస్​పై పోరాడేందుకు భవిష్యత్​లో అభివృద్ధి చేసే వ్యాక్సిన్​, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులను న్యాయంగా, పారదర్శకంగా, సమానంగా వినియోగించుకోవాలన్న ఐక్యరాజ్య సమితి అసెంబ్లీలో చేసిన తీర్మానానికి భారత్​ మద్దతుగా నిలిచింది. మెక్సికో ప్రతిపాదించిన ఈ తీర్మానానికి కో-స్పాన్సర్​ చేసిన 179 దేశాల్లో భారత్​ ఒకటి.

"అంతర్జాతీయ సహకారంతో అందుబాటులో ఉన్న ఔషధాలను వినియోగించుకోవాలని భారత్​ ఆశిస్తోంది. దీనితో పాటు యూనీసెఫ్​ వంటి ఏజెన్సీలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న మందుల పంపిణీకి భారత్​ మద్దతుగా నిలిస్తోంది. అందువల్ల ఈ తీర్మానానికి కో-స్పాన్సర్​ చేయడం ఎంతో సంతోషకరం."

- సయ్యద్​ అక్బరుద్దిన్​, ఐరాసలోని భారత శాశ్వత రాయబారి

కరోనాపై పోరులో భారత దేశం తన వంతు కృషి చేస్తూ ప్రపంచానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు హైడ్రాక్రీ క్లోరోక్వీన్​ డ్రగ్స్​ పంపిణీ చేసింది. అగ్రనేతలందరూ భారత సహాయానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఐరాస తీర్మానానికి అమెరికా కూడా మద్దతునిచ్చింది. అయితే పాకిస్థాన్​ సహ పలు దేశాలు మద్దతివ్వలేదు. తీర్మానంలో పలు మార్పులు చేయాలని పాక్​ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:-ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ABOUT THE AUTHOR

...view details