తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డీఆర్​డీఓ ప్రయోగాలను రహస్యంగా ఉంచలేం' - డీఆర్​డీఓ

మిషన్ శక్తి వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్థాలు కొన్ని వారాల్లోనే నిర్వీర్యం అవుతాయని... వీటి వల్ల ఇతర ఉపగ్రహాలకు ఎలాంటి ఆటంకం కలగదని డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీశ్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రయోగం వల్ల వెలుబడే వ్యర్థాలపై నాసా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వివరణ ఇచ్చారు రెడ్డి. ఇలాంటి ప్రయోగాలను రహస్యంగా ఉంచలేమని.. అన్ని దశలు పూర్తయ్యాక వెల్లడిస్తుంటామని తెలిపారు.

డీఆర్​డీఓ

By

Published : Apr 6, 2019, 7:38 PM IST

Updated : Apr 6, 2019, 8:59 PM IST

'డీఆర్​డీఓ ప్రయోగాలను రహస్యంగా ఉంచలేం'

మిషన్​ శక్తి ప్రయోగాన్ని అత్యంత దిగువ కక్ష్య అయిన 300 కిలో మీటర్ల ఎత్తులోనే చేపట్టామని డీఆర్​డీఓ ఛైర్మన్​ సతీశ్​ రెడ్డి వెల్లడించారు. 1000 కిలో మీటర్ల ఎత్తులో ఈ ప్రయోగం నిర్వహించే వీలున్నా​ ... అంతరిక్ష వ్యర్థాల నుంచి వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు కావాలనే ఈ కక్ష్యను ఎంచుకున్నట్లు తెలిపారు.

మార్చి 27న భారత్ విజయవంతంగా ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించిన తర్వాత అంతరిక్ష వ్యర్థాల గురించి నాసా చేసిన వాఖ్యలపై ఆయన ఈ సమాధానమిచ్చారు.

దీని ద్వారా ఉత్పన్నమైన అంతరిక్ష వ్యర్థాలు కేవలం కొన్ని వారాల్లోనే నాశనమవుతాయని పేర్కొన్నారు. ఫలితంగా.. అంతరిక్ష కేంద్రం సహా ప్రపంచ దేశాల శాటిలైట్లకు ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొన్నారు.

ప్రయోగానికి అవసరమైన అన్నిరకాల అనుమతులు, జాగ్రత్తలు తీసుకునే ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

మిషన్​ శక్తి వంటి ప్రయోగాలను చేపట్టి... ఆ విషయాలను బహిర్గతం చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తప్పుబట్టారు. దీనిపై స్పందించిన సతీశ్​ రెడ్డి ఇలాంటి ప్రయోగాలు చేసిన తర్వాత వాటిని రహస్యంగా ఉంచడం వీలుకాదని పేర్కొన్నారు.

"ఈ విధమైన మిషన్ల ప్రయోగాలు నిర్వహించిన తర్వాత రహస్యంగా ఉంచడం వీలుకాదు. ఇంతకు ముందు ఈ ప్రయోగాన్ని నిర్వహించి అమెరికా, చైనా వంటి దేశాలు కూడా ప్రజల దృష్టికి తెచ్చాయి. ఎందుకంటే ఈ శాటిలైట్​ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష కేంద్రాల్లో చాలా మంది గుర్తించారు"
- సతీశ్​​ రెడ్డి, డీఆర్​డీఓ ఛైర్మన్​

భారత్​ మిషన్​ శక్తి ప్రయోగంతో... భూమి నుంచి నిర్దేశిత కక్ష్యలో ఉన్న శాటిలైట్​ను విజయవంతంగా పేల్చి... ఈ సాంకేతికత ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్​ నిలిచింది. ఏ- శాట్​ ప్రయోగంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష రంగంలో భారత్​.. తన సత్తా చాటిందని కీర్తించారు.

ఇదీ చూడండి:భారత్​ భేరి: భాజపా దూసుకెళ్తోంది కానీ...

Last Updated : Apr 6, 2019, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details