తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో అత్యంత సమీపంలో భారత్​-చైనా బలగాలు

వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాంగాంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలోని స్పాంగ్​గుర్​ గ్యాప్​ వద్ద చైనా భారీగా తన బలగాలను మోహరించినట్టు తెలుస్తోంది. వేలాది మంది సైనికులతో పాటు యుద్ధ ట్యాంకులు కూడా అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఇది గమనించిన భారత్​.. అంతే స్థాయిలో తన బలగాలను అక్కడ మోహరించింది. దీంతో.. ఇరు దేశాల జవాన్లు.. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొనేంత సమీపంలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

India, China troops within shooting range at Spanggur Gap
ముదిరిన వివాదం- అక్కడ అతి సమీపంలో జవాన్లు

By

Published : Sep 12, 2020, 8:20 PM IST

సరిహద్దులో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పైచేయి సాధించడానికి భారత్​-చైనాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు వెంబడి భారీగా బలగాలను తరలిస్తున్నాయి. తాజాగా.. పాంగాంగ్​ సరస్సులోని దక్షిణ ప్రాంతమైన స్పాంగ్​గుర్​ గ్యాప్​ వద్ద వేలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులను చైనా మోహరించినట్టు సమాచారం. ఇందుకు దీటుగా భారత్​ కూడా తన బలగాలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు.. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొనేంత దగ్గరగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

"పాంగాంగ్​ సరస్సు దక్షిణ ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక శిఖరాలను భారత సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. ఈ ప్రక్రియ గత నెల 30న మొదలైంది. అది చూసిన చైనా పీఎల్​ఏ.. గురుంగ్​- మగర్​ పర్వత ప్రాంతాల మధ్య ఉన్న స్పాంగ్​గుర్​ గ్యాప్​నకు భారీగా బలగాలను తరలించింది. దీంతో భారత సైన్యం అప్రమత్తమై.. అంతే స్థాయిలో బలగాలను అక్కడ మోహరించింది. ఇరు దేశాల సైనికులు ఇప్పుడు.. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొనేంత దూరంలో మాత్రమే ఉన్నారు."

--- భారత సైనిక వర్గాలు.

సరిహద్దును ఏకీకృతం చేసేందుకు, టిబెట్​ ప్రాంతాన్ని స్థిరీకరించేందుకు తన మిలీషియాను ఈసారి రంగంలోకి దింపింది చైనా. ఇందులో పర్వతారోహకులు, బాక్సర్లు, స్థానిక ఫైట్​ క్లబ్స్​లోని సభ్యులు ఉన్నారు. మిలీషియాలోని చాలా మంది స్థానికులే ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధ సమయంలో వీరిని మోహరించే అలవాటు చైనా పీఎల్​ఏకు ఉందని సైనిక వర్గాలు స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి:-టిబెట్‌ స్వేచ్ఛావాణికి భారత్‌ అండ అత్యవసరం!

అయితే చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. కచ్చితంగా ప్రతిఘటిస్తామని భారత్ ఇప్పటికే​ హెచ్చరించింది.

వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఏడాది మే నుంచి భారత్​-చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఓవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ... చైనా ద్వంద్వ వైఖరి వల్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details