తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భారత్-చైనా మధ్య మరోసారి సైనిక అధికారుల స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ నెల 12న కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు భేటీ కానున్నారు. బలగాల ఉపసంహరణ సహా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తగ్గించడంపై సమాలోచనలు జరపనున్నారు.
భారత్, చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో ఇప్పటికి ఆరుసార్లు చర్చలు జరిగాయి.
ఈ ఏడాది మే నెల నుంచి భారత్‌పై కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. గల్వాన్ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఆ తర్వాత జరిగిన చర్చలతో పరిస్థితి కాస్త చక్కబడినప్పటికీ.. ఆగస్టు చివరి వారంలో సరిహద్దులో మరోమారు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది చైనా. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య బంధం మరింత బలహీనపడింది.
ఇదీ చూడండి:-'చైనా అసలు లక్ష్యం అరుణాచల్.. పావుగా పనికొస్తున్న లద్దాఖ్'