తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు భారత్-చైనా 9వ విడత సైనిక కమాండర్ల భేటీ

తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా భారత్​-చైనా సైనిక ప్రతినిధులు నేడు భేటీ కానున్నారు. మోల్డో సెక్టార్​లో ఈ సమావేశం జరగనుంది.

India, China to hold 9th round of military talks on Sunday
నేడు భారత్-చైనా 9వ విడత సైనిక కమాండర్ల భేటీ

By

Published : Jan 24, 2021, 5:36 AM IST

భారత్​, చైనాల మధ్య 9వ విడత కార్ప్స్ కమాండర్​ స్థాయి చర్చలు నేడు జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​లో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించే దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. సరిహద్దులో చైనావైపు ఉన్న మోల్డో సెక్టార్​ వద్ద ఈ భేటీ జరగనుందని అధికార వర్గాలు తెలిపాయి.

నవంబర్ 6న ఎనిమిదో విడత సైనిక చర్చలు జరిగాయి. బలగాల ఉపసంహరణపై ఇరువర్గాలు విస్తృతంగా చర్చించాయి. అయితే ఇదివరకటి చర్చల్లాగే ఇందులోనూ ఎలాంటి ముందడుగు పడలేదు.

ఉపసంహరణ ప్రక్రియ చైనానే ప్రారంభించాలని భారత్ చెబుతూ వస్తోంది. అప్పటివరకు భారత సైన్యం అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది. భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​తో పాటు, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె సైతం ఇదే విషయాన్ని పలు మార్లు స్పష్టం చేశారు. దాదాపు 50 వేల మంది భారత సైనికులు తూర్పు లద్దాఖ్​ సరిహద్దు వద్ద పహారా కాస్తున్నారు. చైనా సైతం అదే స్థాయిలో బలగాలను మోహరించింది.

ఇదీ చదవండి:'చైనా అలా చేస్తేనే భారత బలగాలు వెనక్కి'

ABOUT THE AUTHOR

...view details