సంయమనం పాటించి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం భారత్ ప్రధాన లక్ష్యం అని, ఇతర దేశాలతో విభేదించటం తమ ఉద్దేశం కాదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జయశంకర్ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక పాత్ర పోషించాలని పలు దేశాలు ఆహ్వానించడంపై ఆయన స్పందించారు. వాణిజ్యపరంగా వ్యవహరించడం భారత్ మార్గం కాదని తెలిపారు. దిల్లీలో రైజీనా చర్చా వేదిక (రైజీనా డైలాగ్) అనే సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాడే విషయంలో భారత్ ఎప్పటికీ వెనకంజ వేయదని తెలిపారు.
'వాణిజ్యపరంగా వ్యవహరించడం భారత్ మార్గం కాదు' - Raisina Dialogue
ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనప్పుడు తొందర పడకుండా, సంయమనం పాటించి నిర్ణయాత్మకంగా వ్యవహరించటం భారత్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి జై శంకర్ తెలిపారు. ఇతర దేశాలతో విభేదించటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. దిల్లీ రైజీనా చర్చా వేదిక సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి.
భారత్‌ను ప్రశ్నించే హక్కు వారికి లేదు
చైనాతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానిస్తూ ‘‘కీలకమైన విషయాలపై పొరుగున ఉన్న దేశాలతో ఒక అవగాహన రావడం ఎంతో ముఖ్యమని అన్నారు. పరస్పరం సహకరించుకునే విధంగా భారత్-చైనా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎందుకంటే రెండు దేశాల మధ్య బంధం ప్రత్యేకమైనది’’ అని తెలిపారు.
ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందిచారు మంత్రి. రెండు దేశాలు విజ్ఞతతో వ్యవహరించి నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Last Updated : Jan 16, 2020, 7:21 AM IST