భారత్- చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ కోసం ఇరుదేశాల సైనిక కమాండర్ల స్థాయిలో.. ఐదో రౌండ్ చర్చలు వచ్చేవారం జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్ నుంచి బలగాలను వెనక్కి తరలించే లక్ష్యంతో రెండు దేశాల కమాండర్ల మధ్య ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిగాయి. అయితే పెట్రోలింగ్ పాయింట్ 14, 15, 17ఏ వద్ద నుంచి పూర్తిస్థాయిలో సైనిక ఉపసంహరణ జరగలేదు. ఈసారి అదే లక్ష్యంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు సైనిక అధికారులు.
"ఇరు దేశాల సైన్యానికి చెందిన సీనియర్ కమాండర్లు.. పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి పూర్తిస్థాయిలో సైనిక ఉపసంహరణే లక్ష్యంగా వచ్చేవారం సమావేశం కానున్నారు."
-సైనికాధికారుల ప్రకటన
ఆ ప్రాంతాలే సమస్య