సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య మూడో విడత చర్చలు జరిగాయి. కార్ప్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య మంగళవారం 10 గంటల పాటు ఏకధాటిగా సాగిన భేటీలో.. లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో బలగాలను వెనక్కి తీసుకునే మార్గదర్శకాలకు తుది రూపు ఇవ్వడంపై చర్చించారు. ఈ సందర్భంగా తమ ఆందోళనను చైనా ముందుంచిన భారత్.. తూర్పు లద్దాఖ్‌లో చైనా కొత్తగా తమవిగా పేర్కొంటున్న ప్రాంతాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్ధితిని పునరుద్ధరించాలని, గల్వాన్ లోయ సహా సరిహద్దుల వెంట తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. సరిహద్దు అంశాల నిర్వహణపై గతంలో కుదిరిన ఒప్పందాలను చైనా గట్టిగా పాటించాలని సూచించింది.
సరిహద్దు వివాదంపై భారత్-చైనా సుదీర్ఘ చర్చలు - భారత చైనా కాల్పులు
తూర్పు లద్దాఖ్ సరిహద్దు వివాదంపై భారత్-చైనా మధ్య మూడో విడత చర్చలు 10 గంటల పాటు ఏకధాటిగా సాగాయి. కమాండర్ స్థాయి అధికారుల మధ్య జరిగిన ఈ భేటీలో.. తూర్పు లద్దాఖ్‌లో చైనా కొత్తగా తమవని పేర్కొంటున్న ప్రాంతాల పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గల్వాన్ లోయ సహా సరిహద్దుల వెంట తమ బలగాలను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.
లద్దాఖ్‌లో బలగాలు వెనక్కి తీసుకోవాలని చైనాకు భారత్ స్పష్టం
వాస్తవాధీన రేఖ వద్ద భారత్ వైపు ఉన్న చుషుల్ సెక్టార్లో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ చర్చలు జరిగాయి. భారత్ తరఫున 14వ కార్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్ సైనిక జిల్లా మేజర్ లీ లిన్ పాల్గొన్నారు.
Last Updated : Jul 1, 2020, 7:00 AM IST