తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్రిక్తతల వేళ ఒకేచోట భారత్​, చైనా రక్షణ మంత్రులు - india china border tensions

భారత్​- చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు ఒకే టేబుల్​పై కూర్చోనున్నారు. మాస్కోలో జరిగే రష్యా విక్టరీ పరేడ్​ ఇందుకు వేదిక కానుంది. ఈ సందర్భంగా భారత్​- చైనా రక్షణ మంత్రులు మాట్లాడుకునే అవకాశాలున్నాయి. వారి సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

India, China defence ministers to share table at Moscow Red Square on Wednesday
ఒకే టేబుల్​పై కూర్చోనున్న భారత్​, చైనా రక్షణ మంత్రులు

By

Published : Jun 22, 2020, 10:27 AM IST

Updated : Jun 22, 2020, 12:14 PM IST

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​- చైనా సైనికుల మధ్య భీకర ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయాయి. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో భారత రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, చైనా రక్షణ మంత్రి వీ ఫెంఘీ ఒకే టేబుల్​పై కూర్చోనుండటం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. మాస్కోలోని ప్రఖ్యాత రెడ్ స్క్వేర్​లో బుధవారం జరిగే రష్యా విక్టరీ పరేడ్​లో వీరిద్దరూ పాల్గొననున్నారు. రష్యా రక్షణమంత్రి సేర్జీ షోయిగుతో కలిసి ఒకే టేబుల్​పై కూర్చుంటారు.

ఈ సందర్భంగా రాజ్​నాథ్​, ఫెంగీలు మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. వారి సంభాషణకు ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరి మధ్య అధికారిక సమావేశంపై ఎలాంటి ప్రకటన లేకపోయినప్పటికీ.. భేటీ అయ్యేలా చేసేందుకు రష్యా ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

రెండు రోజుల్లో..

రక్షణ మంత్రులు ఒకే వేదికను పంచుకోవడానికి ముందు రోజు మంగళవారం.. భారత్​, చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఎస్​ జయ్​శంకర్​, వాంగ్ యీలు వీడియో కాన్ఫరెన్స్​ సమావేశంలో పాల్గొననున్నారు. రష్యా విదేశాంగ మంత్రి కూడా ఇందులో పాల్గొంటారు. ఈ త్రైపాక్షిక భేటీని రష్యానే ఏర్పాటు చేస్తోంది.

ఈ సమావేశాల ద్వారా భారత్​- చైనా మధ్య సహజ మధ్యవర్తి పాత్రను రష్యా పోషిస్తుడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ప్రకటించినప్పటికీ ఇరు దేశాలు తిరస్కరించాయి. అందుకే ఈ విషయాన్ని ప్రతిష్టగా భావిస్తోంది రష్యా. మిత్రదేశాల మధ్య సయోధ్య కుదర్చాలని చూస్తోంది.

రష్యా విక్టరీ పరేడ్​ మే 9నే జరగాల్సింది. కరోనా కారణంగా జూన్​ 23కి వాయిదా పడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి స్మారకంగా మాస్కోలో ఏటా ఈ పరేడ్​ను నిర్వహిస్తోంది రష్యా. ఇది 75వ వార్షికోత్సవం కావడం వల్ల 13 దేశాలను ఆహ్వానించి ఘనంగా ఏర్పాట్లు చేసింది. పరేడ్​లో పాల్గొనేందుకు 75 మంది సభ్యుల బృందాన్ని ఐఏఎఫ్​ సీ-17 సైనిక విమానంలో పంపింది భారత్​. చైనా నుంచి 106 మంది సభ్యుల బృందం ఇప్పటికే మాస్కో చేరుకుంది.

ఇదీ చూడండి: చైనా కవ్విస్తే దీటుగా బదులిచ్చేలా సైన్యానికి స్వేచ్ఛ!

Last Updated : Jun 22, 2020, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details