భారత్-చైనా సీనియర్ సైనిక కమాండర్ల మధ్య జరిగిన ఎనిమిదో విడత చర్చలు దాపరికం లేకుండా, నిర్మాణాత్మకంగా సాగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వాస్తవాధీన రేఖ సమీపంలోని చుషుల్ ప్రాంతంలో గతవారం జరిగిన చర్చలపై స్పందించింది. ఘర్షణ పాయింట్ల వద్ద బలగాల ఉపసంహరణపై సమాలోచనలు జరిపినట్లు వెల్లడించింది.
సైనిక, దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూనే ఉండాలని ఇరుపక్షాలు నిర్ణయానికి వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికీ కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే మరో విడత చర్చలు జరిపాలని అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.
"చర్చలు ఎలాంటి దాపరికం లేకుండా జరిగాయి. ఘర్షణ ప్రాంతాల్లోని బలగాలను ఉపసంహరించే అంశంపై లోతుగా, నిర్మాణాత్మకంగా ఇరుపక్షాలు సమాలోచనలు జరిపాయి."