తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 9:21 PM IST

ETV Bharat / bharat

బలగాల ఉపసంహరణకు భారత్-చైనా అంగీకారం

సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణకు భారత్​- చైనా అంగీకరించాయి. పూర్తిస్థాయిలో ఉపసంహరణ ఆలస్యంగా సాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు దౌత్యాధికారుల స్థాయిలో ఆన్​లైన్​ ద్వారా చర్చలు జరిగాయి. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

indo china
త్వరితగతిన బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం

తూర్పు లద్దాఖ్​ నుంచి పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణకు భారత్- చైనా అంగీకరించాయి. పూర్తిస్థాయిలో అభివృద్ధి, దౌత్య సంబంధాల పునరుద్ధరణకు సరిహద్దులో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

సరిహద్దు అంశమై చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ఇరుదేశాల దౌత్యాధికారులు ఆన్​లైన్​లో సంభాషించారు. జులై 14న కమాండర్ల స్థాయిలో జరిగిన సమావేశంలో పూర్తిస్థాయి ఉపసంహరణ చేపట్టాలని ఇరుదేశాలు అంగీకరించాయి. అయితే అంచనాల మేరకు బలగాల ఉపసంహరణ జరగని నేపథ్యంలో ఈ దిశగా చర్యలు చేపట్టేందుకు ఇరుదేశాల దౌత్యాధికారుల మధ్య సంభాషణ జరిగింది.

త్వరలో మరో భేటీ..

పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణకు సీనియర్ కమాండర్ల స్థాయిలో త్వరలో మరో భేటీ నిర్వహించాలని ఇరు వర్గాలు అంగీకరించినట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా బలగాలను వెనక్కి తరలించాలని ఇరుదేశాలు అంగీకరించినట్లు చెప్పారు. సరిహద్దు వెంట శాంతి నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇరుదేశాల అధికారులు అంగీకరించినట్లు వెల్లడించారు.

సీనియర్ కమాండర్ల స్థాయిలో జరిగిన సమావేశంలో కుదిరిన అంగీకారం మేరకు చర్యలు చేపట్టేందుకు ఇరువర్గాలు అంకితభావంతో ఉన్నట్లు స్పష్టం చేసింది విదేశాంగ శాఖ.

బలగాల ఉపసంహరణ దిశగా దౌత్య, సైనిక వర్గాల మధ్య జరుగుతున్న సంభాషణను కొనసాగించాలని ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలిపింది.

ఇదీ చూడండి:రాజ్​భవన్​లో 'రాజ'కీయం- అసెంబ్లీ సమావేశం కోసం ధర్నా

ABOUT THE AUTHOR

...view details