తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గగన పోరాటాల్లోనే కాదు.. మానవతా సేవలోనూ భేష్​' - modi latest twitter news

శత్రువులను గగనతలంలోనే మట్టుబెట్టి, వెన్నులో వణుకు పుట్టించే సత్తా మన భారత వైమానిక దళానిది. పోరాటాల్లోనే కాదు, ప్రకృతి విపత్తు సమయాల్లోనూ భారత వాయిసేన అందించే సేవలు ఎంతో విశిష్టమైనవి. అంతటి ఘన చరిత్ర గల భారత వైమానిక దళ 88వ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు.

India celebrates 88th anniversary of Indian Air Force
"గగన పోరాటాల్లోనే కాదు.. మానవత్వ సేవలోనూ మీరే కీలకం"

By

Published : Oct 8, 2020, 10:07 AM IST

భారత వైమానిక దళ 88వ వార్షికోత్సవాన్ని పురస్కరించకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ.. మానవతా సేవలోనూ భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని ట్విట్టర్​ వేదికగా కొనియాడారు.

"మీరు భారత గగన తలాన్ని మాత్రమే రక్షించడం లేదు. విపత్తు సమయాల్లో.. మానవతా సేవలోనూ మీ పాత్ర ఎంతో విలువైంది. మీ ధైర్యం, పరాక్రమం, అంకితభావం.. అందరిలో స్ఫూర్తి నింపుతాయి."

-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

'నాకు నమ్మకం ఉంది'

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ట్విట్టర్​ వేదికగా భారత వాయుసేన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గగన యోధులకు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు.

"దేశ గగనతలాన్ని భారత వైమానిక దళం(ఐఏఎఫ్​)..ఎల్లప్పుడూ రక్షిస్తుందనే నమ్మకం ఉంది. మీరంతా నింగిని ముద్దాడి, క్షేమంగా నేలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను."

--రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి.

ఇదీ చూడండి:'దేశీయ రక్షణ సామర్థ్యంతోనే శాంతికి పునాది'

ABOUT THE AUTHOR

...view details