తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నేపాల్​ మ్యాప్​' పరిణామాలపై భారత్​ కన్ను!

నేపాల్​లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నేపాల్ తాజాగా రూపొందించిన వివాదాస్పద జాతీయ పటానికి ఆమోద ముద్ర ప్రయత్నాలను గమనిస్తున్నట్లు తెలిపింది.

India
నేపాల్​ మ్యాప్

By

Published : May 28, 2020, 12:43 PM IST

నేపాల్​ రూపొందించిన కొత్త జాతీయ పటానికి సంబంధించిన పరిణామాలను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది. లిపులేఖ్​, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాలను తమ భూభాగంలోనివిగా చెబుతూ కొత్త మ్యాప్​నకు ఆమోదం తెలిపింది నేపాల్ కేబినెట్​.

కొత్త పటానికి సంబంధించి ఆమోద ముద్ర వేయటానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ దిగువ సభలో బలం లేని అధికార కమ్యూనిస్టు పార్టీ దీన్ని నెగ్గించుకోలేకపోతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభను బుధవారం ఏర్పాటు చేయగా ఆకస్మికంగా రద్దయింది.

నేపాల్​ చర్యలను భారత్​ తీవ్రంగా పరిగణిస్తోంది. రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధాలను పాడుచేసుకోవద్దని సూచించింది.

"నేపాల్​లోని పరిణామాలను నిశితగా పరిశీలిస్తున్నాం. సహజంగానే సరిహద్దు సమస్యలు చాలా సున్నితమైనవి. ఇద్దరు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం రావాలంటే రెండు దేశాల మధ్య నమ్మకం, విశ్వాసం అవసరం."

- ప్రభుత్వ వర్గాల సమాచారం

ఎందుకీ ఉద్రిక్తత?

ఈ నెల 8న మానససరోవర్‌ యాత్ర కోసం ఉత్తరాఖండ్‌ నుంచి లిపులేఖ్​‌ పాస్‌ వరకు భారత్‌ నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. అది జరిగిన కొద్ది రోజులకు(మే 18).. లిపులేఖ్, కాలపానీ సహా లింపియాధురా ప్రాంతాలను తమ పరిధిలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్​కు ఆ దేశ కేబినెట్​ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయడానికి ఈ నెల 22న పార్లమెంట్​లో ప్రతిపాదన చేసింది.

ప్రతిపాదన గట్టెక్కుతుందా?

ఈ రాజ్యాంగ సవరణకు సభలోని మూడింట రెండో వంతు మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలో తమ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతూ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహంచారు నేపాల్​ ప్రధాని కేపీ ఓలీ.

జాతీయ అసెంబ్లీలో నేపాల్​ కమ్యునిస్ట్​ పార్టీకి మూడింట రెండోవంతు మెజారిటీ ఉంది. కానీ దిగువ సభలో తమ ప్రతిపాదన గట్టెక్కించుకోవడానికి దాదాపు 10సీట్లు వెనకపడి ఉంది ఓలీ ప్రభుత్వం.

అయితే.. ఈ ప్రతిపాదనకు మద్దతు తెలపాలంటే.. ఎన్నోఏళ్లుగా పడి ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపక్ష పార్టీలు ఓలీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కొత్త మ్యాప్​నకు నేపాల్​ కాంగ్రెస్​ మద్దతునిచ్చినప్పటికీ... రాజ్యంగ సవరణకు మాత్రం అంగీకరించడం లేదు. అన్ని పార్టీలు ముందు చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని సూచించింది.

ఇదీ చూడండి:'కాలాపానీ'పై నేపాల్​కు భారత్​ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!

ABOUT THE AUTHOR

...view details