తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనాకు 'వందేభారత్' విమాన సేవలు రద్దు - vandebharat mission china

చైనాకు వందేభారత్ మిషన్ విమానాలను భారత్ రద్దు చేసింది. భారత్​ నుంచి వచ్చే విదేశీయుల వీసాలను తాత్కాలికంగా చైనా నిలిపివేయటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

vandebharat-china
వందేభారత్

By

Published : Nov 6, 2020, 7:54 AM IST

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా చైనాకు నడపదలిచిన పలు విమానాలను మన దేశం రద్దు చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా భారత్‌ నుంచి వచ్చే విదేశీ ప్రయాణికుల వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చైనా ప్రకటించిన నేపథ్యంలో విమానాల రద్దు నిర్ణయం వెలువడింది.

అక్టోబరు 30వ తేదీన దిల్లీ నుంచి వుహాన్‌కు వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రయాణికుల్లో 20 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయిన పరిస్థితుల్లో దిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ప్రకటనను వెలువరించింది. చైనా వీసాలు మంజూరై ఉన్నప్పటికీ భారత్‌ నుంచి వచ్చే వారికి తమ దౌత్యకార్యాలయాలు/కాన్సులేట్లలో ఆరోగ్యానికి సంబంధించిన పత్రాలపై స్టాంపును వేయబోమని స్పష్టంచేసింది.

ఇదీ చూడండి:అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details