భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు భారత రైల్వే అధికారులు ప్రకటించారు. మార్చి 3నుంచి రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి పునరుద్ధరణపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ రైలు బుధ, ఆదివారాల్లో భారత్ నుంచి పాక్కు వెళ్తుంది.
సేవలు నిలిపేసిన పాక్