భారత సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ అన్నారు. సరిహద్దులు పూర్తిగా భద్రంగా, సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి దుస్సాహసాలనైనా తిప్పికొట్టేలా సిద్ధంగా ఉన్నామని దేశానికి భరోసా కల్పించారు.
74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమృత్సర్లోని అట్టారి- వాఘా సరిహద్దులో జాతీయ జెండాను ఎగురువేశారు దేశ్వాల్. భద్రతా సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరించుకున్నారు.
"తన సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకుంటూ శాంతికాముకంగా వ్యవహరిస్తోంది భారత్. తమ బలం, బలగంతో సరిహద్దులో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. మన సరిహద్దులు పూర్తిగా భద్రం, సురక్షితమని దేశానికి భరోసా ఇస్తున్నాం."