తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పద్మాసనంతో సముద్రంలో ఈత- ఉపాధ్యాయుడి సాహసం - సముద్రంలో ఈత

సముద్రంలో ఈత కొట్టాలంటే చాలా కష్టం. అలాంటిది కేరళకు చెందిన ఓ ఉపాధ్యాయుడు మాత్రం కాళ్లకు చైను కట్టుకుని పద్మాసనంతో ఛాతితో ఈత కొట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఈ సాహసం చేశారు.

India Book of Records: A teacher swims in sea in Pdmasana position by tying chain to leg
పద్మాసనం వేస్తూ ఈత కొట్టి అరుదైన రికార్డు

By

Published : Dec 18, 2020, 8:05 PM IST

పద్మాసనంతో ఈత కొట్టి అరుదైన రికార్డు

కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కాళ్లకు చైను కట్టుకుని పద్మాసనంతో సముద్రంలో ఈత కొట్టాడు. 25నిమిషాల 16 సెకన్లలో ఒక కిలోమీటరు దూరాన్ని ఛాతితో ఈది అందరినీ అబ్బుర పరిచారు. ప్రఖ్యాత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించేందుకు ఆయన ఈ సాహసం చేశారు.

మూడోతరగతి నుంచే..

కర్ణాటక ఉడిపి జిల్లా కుందాపుర్​ మండలం కంచుగొడి గ్రామానికి చెందిన నాగరాజ కర్వీ బంట్వాల్​ మండలం కల్మంజాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన మూడో తరగతిలో ఉన్నప్పటినుంచే ఈత కొట్టడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు.

గత జనవరిలో గుజరాత్, వడోదరాలో జరిగిన జాతీయస్థాయి ఈత పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించారు. ఇప్పటికే ఆయన వేల మంది విద్యార్థులకు ఈత నేర్పించారు.

ఇదీ చదవండి :బంగాల్​కు అమిత్​ షా- చేరికలే లక్ష్యమా?

ABOUT THE AUTHOR

...view details