తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్ టీకాకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారు' - అతిపెద్ద వ్యాక్సిన్​ కొనుగోలుదారుగా భారత్

కొవిడ్ టీకాకు భారత్ అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించినట్లు అమెరికా చెందిన డ్యూక్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఇప్పటివరకు భారత్ 1600 మిలియన్ల టీకా డోసుల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తేలింది.

India contracts for 1600 million vaccine doses
కొవిడ్ టీకా అతిపెద్ద కొనుగులుదారు భారత్

By

Published : Dec 4, 2020, 9:21 PM IST

కరోనా వైరస్ విజృంభణను కట్టడి చేసే టీకా డోసులను సొంతం చేసుకునే విషయంలో భారత్‌ అతి పెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. మన దేశం ఇప్పటివరకు 1600 మిలియన్ల టీకా డోసులను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుందని అమెరికా‌కు చెందిన డ్యూక్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన 'లాంచ్‌ అండ్ స్కేల్ స్పీడ్‌ మీటర్' నివేదిక వెల్లడిస్తోంది. ఈ మొత్తం డోసులు దేశ జనాభాలో 60 శాతం మందికి సరిపోతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ జాబితాలో దాదాపు 1600 మిలియన్ల డోసులతో యూరోపియన్ యూనియన్ రెండో స్థానంలో నిలవగా, 1000 మిలియన్ల డోసులతో అమెరికా మూడో స్థానంలో ఉందని తెలిపింది.

టీకా కొనుగోళ్ల విషయంలో వివిధ దేశాలు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించే లక్ష్యంతో నవంబర్‌ 30వరకు లభ్యమైన టీకా సేకరణ, తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఈ నివేదిక పేర్కొంది. టీకా తయారీ సామర్థ్యం మెరుగ్గా ఉన్న భారత్, బ్రెజిల్ వంటి దేశాలు టీకా అభివృద్ధి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంలో విజయవంతమయ్యాయని వెల్లడించింది. అయితే జపాన్, కెనడా, యూకే వంటి దేశాలు ఇప్పటివరకు 400 మిలియన్ల కంటే తక్కువ టీకా డోసులనే కొనుగోలు చేశాయని తెలిపింది.

అందరికీ టీకా అప్పుడే..

ఒకవైపు, పలు దేశాలు టీకాల కొనుగోళ్ల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ టీకా లభించడానికి 2023 లేక 2024 వరకు పట్టొచ్చని ఆ నివేదిక అంచనావేసింది. అధిక ఆదాయ దేశాలు 3.8 బిలియన్ల డోసులను సొంతం చేసుకోగా, మధ్య, అల్ప ఆదాయ దేశాలు 829 మిలియన్లు, 1.7 బిలియన్ల డోసులను కొనుగోలు చేశాయని ఆ అధ్యయనం వెల్లడిచేస్తోంది. పెట్టుబడి సామర్థ్యం, కొనుగోలు శక్తి కారణంగా సంపన్న దేశాలు టీకాను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసుకొనే విషయంలో దూకుడుగా ఉన్నాయని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:కొవిడ్​ టీకా-ముందస్తు ప్రణాళికలో మనమెక్కడ?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details