రక్షణ ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయటంలో భారత్ దూసుకెళ్తోంది. ఐరోపా దేశాలతో భారీ స్థాయిలో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవటంలో రష్యా, పోలాండ్ దేశాలను వెనక్కి నెట్టింది. అర్మెనియా దేశానికి ఆయుధాలను గుర్తించే 4 రాడార్ వ్యవస్థలను అందించేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం భారత్కు 40 మిలియన్ డాలర్లు చెల్లించనుంది అర్మెనియా.
" ఐరోపాలోని అర్మెనియాకు ఆయుధాలు గుర్తించే 4 స్వాతి రాడార్లను అందించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. ఈ రాడార్లను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేయగా.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) తయారు చేసింది. అర్మెనియాకు ఆయా సామగ్రిని అందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఇది గొప్ప విజయమనే చెప్పాలి. "
- ప్రభుత్వ వర్గాలు
రష్యా, పోలాండ్ దేశాల రాడార్ వ్యవస్థలను ముందుగా పరిశీలించిన అర్మెనియన్ దేశం.. వాటిని కాదని భారత్ రూపొందించిన రాడార్లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాయి ప్రభుత్వ వర్గాలు.