ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించింది భారత్. తాజాగా బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తోన్న జమాత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రసంస్థపై నిషేధం విధించింది హోంశాఖ.
మరో ఉగ్రవాద సంస్థపై భారత్ నిషేధం - భారత్
బంగ్లాదేశ్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తోన్న జమాత్-ఉల్-ముజాహిదీన్ సంస్థపై భారత హోంశాఖ నిషేధం విధించింది. ఈ సంస్థ తీవ్రవాద చర్యలకు పాల్పడటం, పెంపొందించడం, ప్రేరేపించడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్లు హోంశాఖ ప్రకటించింది.
మరో ఉగ్రవాద సంస్థపై భారత్ నిషేధం
ఈ సంస్థ తీవ్రవాద చర్యలకు పాల్పడటమే కాక పెంపొందించడం, భారత్లో తీవ్రవాద కార్యకలాపాల కోసం యువతను నియమించడం వంటి పనులు చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది.
ఈ సంస్థను 1967, చట్టవ్యతిరేక చర్యల చట్టం కిందకు తెస్తూ నిషేధం విధించినట్లు హోంశాఖ పేర్కొంది.
- ఇదీ చూడండి: సూరత్ ప్రమాద ఘటనలో 18 మంది విద్యార్థుల మృతి