తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడ్డంకులు లేని దౌత్య సాయం కావాలి: భారత్​ - భారత్​

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​కు అడ్డంకులు లేని దౌత్య సాయం కావాలని పాకిస్థాన్​ను కోరింది భారత్​. బెదిరింపు, భయం లేని వాతావరణంలో జాదవ్​ను భారత అధికారులు కలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది.

అడ్డంకులు లేని దౌత్య సాయం కావాలి: భారత్​

By

Published : Aug 2, 2019, 4:44 PM IST

పాకిస్థాన్‌ కారాగారంలో ఉన్న భారత మాజీ నౌకాదళ అధికారి కుల్​భూషణ్‌ జాదవ్‌ను ఇవాళ భారత దౌత్య అధికారులు కలుసుకోవచ్చని దాయాది దేశం చేసిన ప్రతిపాదనపై భారత్‌ స్పందించింది. అడ్డంకులు లేని దౌత్య సాయం కావాలని పాకిస్థాన్‌ను భారత్‌ కోరింది.

బెదిరింపు, భయం లేని వాతావరణంలో కుల్​భూషణ్ జాదవ్‌ను భారత అధికారులు కలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. దీనిపై పాకిస్థాన్‌ స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

భారత నౌకాదళంలో పదవీ విరమణ చేసిన కుల్​భూషణ్‌ జాదవ్‌ను గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్‌ నిర్బంధించింది. పాక్‌ సైనిక కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. జాదవ్‌కు దౌత్య సాయం అందించాలని, ఆయనకు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పాక్‌ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

జాదవ్​ను కలిసేందుకు పాకిస్థాన్​ కొన్ని షరతులు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. అందులో ఒకటి పాకిస్థాన్​ అధికారుల సమక్షంలోనే జాదవ్​ను భారత దౌత్య అధికారులు కలవటం అన్నారు.

ఇదీ చూడండి: ఆగస్టు 6 నుంచి అయోధ్యపై రోజువారీ విచారణ

ABOUT THE AUTHOR

...view details