తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య'పై పాక్​ కుయుక్తులకు భారత్​ దీటైన జవాబు

అయోధ్య తీర్పుపై దాయాది పాకిస్థాన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని మండిపడింది భారత్. ఐరాస మానవ హక్కుల కమిషన్ వేదికగా అయోధ్య తీర్పుపై ఆరోపణలు చేసిన పాక్​కు భారత్ దీటుగా సమాధానమిచ్చింది. పాకిస్థాన్​లో మైనారిటీల హక్కులకు భంగం కలుగుతోందని ఆరోపించింది.

ayodhya
'అయోధ్య'పై పాక్​ కుయుక్తులకు భారత్​ దీటైన జవాబు

By

Published : Nov 29, 2019, 10:00 AM IST

అయోధ్య కేసులో సుప్రీంతీర్పుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఎదుట దాయాది పాకిస్థాన్ ఆరోపణల్ని దీటుగా తిప్పికొట్టింది భారత్. తమకు స్వార్థపూరిత, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం కంటే భారత్​లోని మైనారిటీలను విద్య సహా వివిధ రంగాల్లో సాధికారుల్ని చేయడమే ప్రాధాన్యాంశమని స్పష్టంచేసింది.

మైనారిటీ వ్యవహారాల వేదిక 12వ సదస్సులో పాక్ ఈ ఆరోపణలు చేయగా... భారత్​ సమాధానమిచ్చింది. భారత దేశ​ ప్రతినిధిగా దౌత్యాధికారి విమర్శ్ ఆర్యన్ హాజరయ్యారు. పాక్​లో మత, నైతిక, వర్గ, భాషాపరమైన మైనారిటీల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని ఆర్యన్ ఆరోపించారు.

"భారత్​ పటిష్ఠ ప్రజాస్వామ్యదేశం. మైనారిటీ పౌరుల హక్కులను సమర్థ రాజ్యాంగ యంత్రాంగం కాపాడుతోంది. పాకిస్థాన్​లో అమలులో ఉన్న దైవదూషణ చట్టాల కారణంగా మత, జాతి, వర్గ, భాషాపరమైన మైనారిటీల హక్కులు అణచివేతకు గురవుతున్నాయి."

-విమర్శ్ ఆర్యన్, భారత ప్రతినిధి

పౌరులు వాస్తవిక ప్రజాస్వామ్యాన్ని అనుభవించని దేశం నుంచి ప్రపంచం మానవ హక్కుల గురించి నేర్చుకునేది ఏమీ లేదని ఆర్యన్ పాక్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"ఈ సదస్సు అత్యంత సున్నితమైన మైనారిటీల మానవ హక్కులకు సంబంధించినది. అయితే అజెండాపై మాట్లాడకుండా తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలు చేస్తోంది పాక్. దాయాదివి కేవలం వక్రీకరణలు మాత్రమే."

-భారత ప్రతినిధి ఆర్యన్

ఇదీ చూడండి: కసబ్​కు శిక్షపడేలా చేసిన ధీర బాలిక.. దీన గాథ

ABOUT THE AUTHOR

...view details