తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2020, 2:04 PM IST

Updated : Mar 2, 2020, 12:36 PM IST

ETV Bharat / bharat

భారత్​-అమెరికా మధ్య 3 ఒప్పందాలు... 'వాణిజ్యం' వాయిదా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇంధన రంగంలో భారీ ఒప్పందం కుదిరినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అద్భుత వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందని ఆకాంక్షించారు.

India and US ink 3 pacts; decides to take ties to comprehensive global partnership
3 ఒప్పందాలపై సంతకం.. 'వాణిజ్యం' మాత్రం త్వరలో

రక్షణ, ఇంధన రంగాల్లో భారత్​-అమెరికా బంధం నూతన శిఖరాలకు చేరింది. ఆయా రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి రెండు దేశాల మధ్య 3 కీలక ఒప్పందాలు కుదిరాయి. అంతా ఊహించినట్టే వాణిజ్య ఒప్పందం మాత్రం వాయిదా పడింది.

విస్తృత చర్చలు...

దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​ వేదికగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.భారత్‌- అమెరికా మైత్రీబంధానికి ప్రభుత్వాలతో సంబంధం లేదని, ప్రజల కేంద్రంగానే బలోపేతమవుతూ వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరబోతున్నాయని తెలిపారు.దేశ భద్రతకు అమెరికా, భారత్‌ మైత్రీబంధం ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు మోదీ. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్​ను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

3 ఒప్పందాలపై సంతకం.. 'వాణిజ్యం' మాత్రం త్వరలో

"అధ్యక్షుడు ట్రంప్​, నేను కలిసి ఇరు దేశాల మధ్య సంబంధాలను సమగ్ర అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. ఈ బంధం ఇక్కడి వరకు తీసుకురావడంలో ట్రంప్​ పాత్ర ఎంతో ఉంది. ఇవాళ జరిగిన చర్చల్లో భారత్​-అమెరికా భాగస్వామ్యంపై అన్ని కోణాల్లోనూ చర్చించాం. అదే విధంగా వాణిజ్య రంగంలో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరపాలని అంగీకరించాం. ఈ చర్చలు మంచి ఫలితాల్ని ఇస్తాయని నేను ఆశిస్తున్నా."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఎంతో లాభదాయక పర్యటన..

భారత్​ పర్యటన ఎంతో లాభదాయకంగా సాగిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. రక్షణ, వాణిజ్య, ఉగ్రవాదం సంబంధిత అంశాలపై మోదీతో విస్త్రతంగా చర్చించినట్టు స్పష్టం చేశారు.

"ఈ పర్యటన ఇరు దేశాలకు ఎంతో లాభదాయకంగా ఉందని ప్రధాని మోదీ కూడా అంగీకరిస్తారని నాకు తెలుసు. మా దేశాల మధ్య రక్షణపరంగా ఉన్న సహకారం ఈరోజు మరితం బలపడింది. 3బిలియన్​ డాలర్లకుపైగా విలువ చేసే అమెరికా రక్షణ పరికరాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఇందులో అపాచీ, ఎమ్​హెచ్​-60 హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల సైనిక సామర్థ్యం మరింత పెరుగుతుంది. భారత్​-అమెరికా సైనికులు కలిసి పనిచేస్తారు. ఉగ్రవాదం నుంచి తమ పౌరులను రక్షించడంపై ఇవాళ మేము చర్చించాం. అదే విధంగా పాకిస్థాన్​ కేంద్రంగా పని చేసే ఉగ్రవాదులను మట్టికరిపించే విధంగా ఆ దేశంతో కలిసి అమెరికా కృషి చేస్తోంది."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

భారత్​ పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేనివని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సబర్మతి ఆశ్రమం, నమస్తే ట్రంప్​ కార్యక్రమం, తాజ్​ మహల్​ సందర్శనపై తన అనుభవాలను పంచుకున్నారు.

ఇదీ చూడండి:- ట్రంప్​ పర్యటన వేళ హింస- ఏడుగురు మృతి

Last Updated : Mar 2, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details