కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి భారత్-పాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జీరో పాయింట్ వద్ద గురువారం ఇరుదేశాలు అధికారులు సమావేశమై ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్రం తరఫున హోంశాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి హాజరయ్యారు.
కర్తార్పుర్పై భారత్-పాక్ మధ్య బుధవారం ఒప్పందం జరగాల్సి ఉంది. అయితే యాత్రికుల నుంచి 20 డాలర్లు వసూలు చేయాలన్న పాక్ నిర్ణయాన్ని పున:సమీక్షించాలని భారత్ కోరినందున ఒకరోజు ఆలస్యమైంది.