వాస్తవాధీన రేఖ వెంబడి (ఎల్ఏసీ) ఉద్రిక్తతలను తగ్గించేందుకు.. భారత్- చైనా దేశాలు మేజర్ జనరల్ స్థాయిలో శనివారం సమావేశంకానున్నాయి. లద్దాఖ్‌లోని దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఈ చర్చలు జరగనున్నాయి. లద్దాఖ్ సెక్టార్‌లోని ఎల్ఏసీ వెంబడి బలగాల ఉపసంహరణపై ఈ భేటీలో అధికారులు చర్చించనుననట్టు సమాచారం.
మే నెలలో మొదలైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల ఇప్పటికే అనేకమార్లు మిలిటరీ, దౌత్య స్థాయిలో సమావేశమయ్యాయి. ఇటీవలే వీటి మధ్య ఐదో దఫా కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు ముగిశాయి. చైనా దళాలు పూర్తి స్థాయిలో వెనుదిరిగి.. మే 5కు ముందున్న యథాతథ స్థితిని నెలకొల్పాలని భారత్ తేల్చిచెప్పింది.