లెఫ్టినెంట్ జనరల్ స్థాయి భేటీ...
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్-చైనాకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు సోమవారం సమావేశమయ్యారు. చైనా పరిధిలో చుషుల్ సెక్టార్‌లోని మోల్డో ఇందుకు వేదికైంది. గల్వాన్ లోయ ఘటన అనంతరం జరిగిన భేటీ కావడం వల్ల అధిక ప్రాధాన్యం నెలకొంది.
ఈ సమావేశంలో.. 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్ భారత బృందానికి నేతృత్వం వహించారు.