తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2020, 5:19 PM IST

Updated : Jun 9, 2020, 5:56 PM IST

ETV Bharat / bharat

భారత్​-చైనా రాజీ... వెనక్కి మళ్లిన బలగాలు

India and China
భారత్​, చైనా

17:11 June 09

2 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గిన బలగాలు

భారత్​- చైనా మధ్య ఈ వారం మరో దఫా సైనిక చర్చలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రెండు దేశాలకు చెందిన బలగాలు సరిహద్దు నుంచి వెనక్కు మళ్లాయి.

ఇరు దేశాల లెఫ్టినెంట్​ జనరళ్ల మధ్య చర్చల అనంతరం చైనా బలగాలు వెనుదిరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గాల్వన్​ లోయ, పీపీ-15, హాట్​ స్ప్రింగ్స్​లో 2-2.5 కిలోమీటర్ల దూరం వెనక్కు వెళ్లాయి. ఈ ప్రాంతాల్లో భారత్​ కూడా బలగాలతో పాటు వాహనాలను వెనక్కు మళ్లించింది.  

ఈ ప్రాంతాల్లోనే సైనిక భేటీలు..

ఈ వారంలో పెట్రోలింగ్​ పాయింట్ 14 (గాల్వన్), గస్తీ పాయింట్​ 15, హాట్​ స్ప్రింగ్​ ప్రాంతాల్లో రెండు సైన్యాల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. బెటాలియన్​ కమాండర్​ స్థాయిలో హాట్​లైన్​ ద్వారా ఈ సమావేశాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లద్ధాఖ్​లో తొలుత ఈ ప్రాంతాల్లోనే చైనా దూకుడును పెంచింది.  

చైనాతో చర్చల్లో పాల్గొనడానికి భారత సైనిక బృందాలు ఇప్పటికే చుశూల్​కు చేరుకున్నాయి. చర్చలకు సంబంధించి సీనియర్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి.

Last Updated : Jun 9, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details