తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దులో శాంతికి భారత్​-చైనా అంగీకారం'

వాస్తవాధీన రేఖ వెంబడి వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని భారత్​-చైనా అంగీకరించినట్లు భారత సైన్యం తెలిపింది. ఇరు దేశాల మధ్య సోమవారం జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలపై నిర్మాణాత్మకంగా, లోతుగా సమాలోచనలు చేసినట్లు స్పష్టం చేసింది.

sinoindia
భారత్​, చైనా

By

Published : Oct 13, 2020, 6:43 PM IST

సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ఇరువైపులా ఆమోదయోగ్యమైన పరిష్కారానికి భారత్-చైనా అంగీకరించినట్లు సైన్యం తెలిపింది. రెండు దేశాల మధ్య సోమవారం జరిగిన సైనిక భేటీలో తీసుకున్న నిర్ణయాలపై స్పందించిన భారత సైన్యం.. నిర్మాణాత్మకంగా, లోతుగా సమాలోచనలు చేసినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:మొదట వైదొలగాల్సింది మీరే: భారత్​

వీలైనంత త్వరగా వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేయాలని చర్చల్లో అంగీకారానికి వచ్చినట్లు వివరించింది భారత సైన్యం. సమస్యల పరిష్కారానికి సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు నిర్వహించడానికి ఇరు దేశాలు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. విభేదాలను వివాదాలుగా మార్చకూడదని, సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతిని నెలకొల్పాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:చైనా ముందుకు దూకితే అది 'తుగ్లక్'​ పనే అవుతుంది!

ABOUT THE AUTHOR

...view details