ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించేందుకు ఆర్ఎస్ఎస్-భాజపా కుట్ర చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2011లో ఉవ్వెత్తున ఎగసిపడిన అవినీతి వ్యతిరేక ఉద్యమం, ఆమ్ఆద్మీ పార్టీ వెనుక భాజపా హస్తముందని విమర్శించారు.
కాంగ్రెస్ను అధికారం నుంచి తప్పించి గద్దెనెక్కడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమానికి భాజపా-ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున మద్దతిచ్చాయని ఆమ్ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు.
ఈ కుట్రల గురించి అందరికీ తెలిసిన విషయాన్ని ఆప్ వ్యవస్థాపక సభ్యుడు ధ్రువీకరించారని రాహుల్ ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం రాహుల్ ఆమెకు తోడుగా అమెరికా వెళ్లారు.