తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలు - స్వాతంత్ర్య దినోత్సవం స్పీచ్ లైవ్

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండా ఆవిష్కరించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ఆయా పార్టీల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు.

I-Day celebrations
థంబ్​నెయిల్

By

Published : Aug 15, 2020, 12:35 PM IST

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ జెండా ఆవిష్కరించారు.

కేంద్ర మంత్రి అమిత్ షా, మరో మంత్రి నితిన్ గడ్కరీ తమ నివాసాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా
అమిత్ షాకు పోలీసుల గౌరవ వందనం

కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జెండా ఎగురవేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ

దిల్లీ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
రాయ్​పుర్​లో ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ఉద్ధవ్ ఠాక్రే
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప
శ్రీనగర్​లో జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
నాగ్​పుర్​లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో మోహన్ భగవత్
ఎల్​కే అడ్వాణీ
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
మూడు రంగుల బెలూన్లను గాల్లోకి వదిలిన అమరీందర్
కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABOUT THE AUTHOR

...view details