దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 35కు చేరింది. తాజాగా పంజాబ్లో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
గత 24 గంటల్లో కొత్తగా 146 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,397కి చేరింది.