తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సామాన్యులపై భారం వేయకుండానే న్యాయం'

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ పుణెలో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ ఎన్నికల ప్రణాళిక, నీతి ఆయోగ్, నిరుద్యోగం, మహిళా రిజర్వేషన్లు సహా పలు అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమధానమిచ్చారు. అయితే ఎంతో మంది అడుగుతున్న తన వివాహంపైనా తెలివిగా బదులిచ్చారు.

By

Published : Apr 5, 2019, 4:39 PM IST

Updated : Apr 5, 2019, 5:48 PM IST

sdaf

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పుణెలో జరిగిన.. 'విద్యార్థులతో ముఖాముఖి'లో పలు ఆసక్తికర సమాధానాలిచ్చారు కాంగ్రెస్ అధ్యక్షుడు.

రాహుల్​ ఏమన్నారంటే...

⦁ మహిళలకు పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరతాం.

⦁ న్యాయ్​ పథకానికి డబ్బు అనిల్​ అంబానీ, నీరవ్​ మోదీ వంటి వారి నుంచే సేకరిస్తాం.

⦁ బాలాకోట్​ దాడుల కీర్తి వాయుసేనకే చెందుతుంది.

⦁ నీతి ఆయోగ్​ స్థానంలో పటిష్ఠ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేస్తాం.

⦁ న్యాయ్​ పథకం కోసం ఆదాయ పన్నులు పెంచం.

⦁ కాంగ్రెస్​ ప్రణాళిక రూపొందించే ముందు వివిధ రంగాల నిపుణులను సంప్రదించాం.

తన బయోపిక్​లో హీరోయిన్​గా ఎవరిని ఎంపిక చేయాలి అన్న ప్రశ్నకు రాహుల్​ గాంధీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పని'తో తనకేనాడో వివాహమైందన్నారు.

విద్యార్థులతో రాహుల్​ ముఖాముఖి
Last Updated : Apr 5, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details