తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.2 కోట్లు పన్ను కట్టాలని 'దేవుడి'కి ఐటీ నోటీసులు - income tax NOTICE TO HANUMAN TEMPLE IN INDORE

మధ్యప్రదేశ్​లోని ఓ హనుమాన్​ ఆలయంలో కోట్లకు పైగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి. అయినప్పటికీ ఆలయ నిర్వాహకులు ఆదాయపన్ను కట్టకపోవడంపై అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలయ ఆదాయంలో 77 శాతం పన్ను చెల్లించాల్సిందిగా స్పష్టం చేశారు.

income-tax-notice-to-hanuman-temple-in-indore
'హనుమాన్ సాక్షిగా.. లెక్కలు చూపండి లేదా పన్ను కట్టండి'

By

Published : Dec 10, 2019, 4:41 PM IST

Updated : Dec 10, 2019, 5:49 PM IST

'హనుమాన్ సాక్షిగా.. లెక్కలు చూపండి లేదా పన్ను కట్టండి'

మధ్యప్రదేశ్​ ఇండోర్​లో​ని రంజిత్​ హనుమాన్​ మందిరానికి 2 కోట్ల రూపాయల పన్ను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది ఆదాయ పన్ను విభాగం.

నోట్ల రద్దుతో బయటపడ్డ కోట్లు...

2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటించే సమయానికి... ఈ హనుమాన్​ ఆలయం వద్ద రూ.26 లక్షల నగదు ఉంది. అవన్నీ పాత నోట్ల అయినందున బ్యాంకులో జమ చేశారు నిర్వహకులు. ఇంత మొత్తం ఒకేసారి జమయ్యే సరికి అనుమానించిన ఆదాయ పన్ను శాఖ.. ఆలయ ఆదాయంపై ఓ కన్నేసింది.

2016-2017 లెక్కలు బయటకు తీయగా.. ఒక్క ఏడాదిలోనే రెండు కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చినట్లు తేల్చింది. ఇంతలా విరాళాలు వచ్చి పడుతున్నా.. ఇన్నాళ్లు ఎందుకు ఆదాయ పన్ను కట్టలేదని నిర్వాహకులను ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం ఆదాయంపై 77 శాతం పన్ను చెల్లించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు నిర్వాహకులు.

"గతంలో మేము ఆదాయపన్ను ఏమీ చెల్లించలేదు. 2016 నోట్ల రద్దు అనంతరం ఐటీ అధికారుల నుంచి మాకు నోటీసు వచ్చింది. అందుకు సమాధానంగా మేము నివేదిక తయారు చేసి సమర్పిస్తాం. ఇందులో ఆలయానికి ట్రస్టు ఎందుకు లేదు? అని అడిగారు, అది కూడా ఏర్పాటు చేస్తున్నాం."
-సాహూ, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు

ఒకవేళ జవాబు ఇచ్చుకోలేకపోతే.. ప్రభుత్వ భూమిలో నిర్మితమైన ఆలయ నిర్వహకులపై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది ఆదాయ పన్ను విభాగం అధికారులు.

ఇదీ చదవండి:'ఉల్లి' దొంగతనాలే దేశంలో నయా ట్రెండ్​!

Last Updated : Dec 10, 2019, 5:49 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details