మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చిన అనంతరం.. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని వారికి వేలల్లో, లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు.
ఇటీవల కారులో వెళ్తుంటే హెల్మెట్ లేదని డ్రైవర్‌పై ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ పోలీసులు చలానా విధించిన పోలీసుల నిర్వాకం మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని వికాస్‌నగర్ ప్రాంతంలో ఓ ఎద్దులబండికి రూ. 1000 జరిమానా విధించారు అధికారులు. స్థానిక నది ఒడ్డున ఎడ్లబండిని గమనించిన గస్తీ విధుల్లోని పోలీసులు రైతుకు చలానా జారీ చేశారు.