తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైటెక్​ యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్​ - భారత ఆర్మీ

హైటెక్​ సాంకేతికతను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది భారత సైన్యం. సైనిక కార్యకలపాలు, నిఘా, గూఢ చర్యం వంటి అంశాల్లో ఈ అధునాతన పరిజ్ఞానాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. దిల్లీలో జరిగిన సైనిక కమాండర్ల సదస్సు (ఏసీసీ)లో ఈ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

In top meet, Army plans going aggressive on 'niche' tech
హైటెక్​ యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్​

By

Published : Oct 31, 2020, 7:29 AM IST

రక్షణ రంగంలో వస్తున్న అధునాతన పరిజ్ఞానాలను సమకూర్చుకోవడంపై భారత సైన్యం దృష్టి పెట్టింది. ఈ హైటెక్​ అంశాలకు అలవాటు పడటం, భవిష్యత్​ యుద్ధాల్లో అవి చూపే ప్రభావం వంటి అంశాలపై మదింపు చేపట్టింది. సోమవారం నుంచి గురువారం వరకూ దిల్లీలో జరిగిన సైనిక కమాండర్ల సదస్సు (ఏసీసీ)లో దీనిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు 'ఈటీవీ భారత్​'తో తెలిపాయి. దీనికితోడు చైనా, పాకిస్థాన్​లు కుమ్మక్కై భారత్​తో యుద్ధానికి దిగితే ఎదుర్కోవడంపై కూడా చర్చించినట్లు వివరించాయి.

హైటెక్​ సాధన సంపత్తికి సంంబధించిన ఒక మార్గ సూచీని సైన్యంలోని శిక్షణ విభాగం.. కమాండర్ల సదస్సుకు సమర్పించింది. హైపర్​సొనిక్​, విద్యుదయస్కాంత ఆయుధాలు, కృత్రిమ మేధస్సు, మూకుమ్మడి దాడులు చేసే డ్రోన్లు, రోబోటిక్స్​, లేజర్లు, కొద్దిసేపు గాల్లోనే సంచరించే వినూత్న ఆయుధాలు, బిగ్​ డేటా అనాలసిస్​, ఆల్గోరిథమిక్​ యుద్ధం వంటివి రక్షణ రంగంలో కీలకంగా మారనున్నాయి. హైపర్​సొనిక్​ ఆయుధాల విషయంలో భారత్​ ఇప్పటికే కొంత పురోగతి సాధించింది. మూకుమ్మడి దాడి డ్రోన్ల అభివృద్ధి విషయంలో అమెరికాతో చేతులు కలిపింది. "ఈ అధునాతన పరిజ్ఞానాలను సైనిక కార్యకలపాలు, నిఘా, గూఢ చర్యం వంటి అంశాల్లో జోడించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి" అని సంబంధిత వర్గాలు 'ఈటీవీ భారత్​'కు వివరించాయి.

ఈ హైటెక్​ సాంకేతికపై మూడు నెలలు పాటు అధ్యయనం చేసిన సైనిక శిక్షణ విభాగం తాజా మార్గసూచీని సమర్పించిందని తెలిపాయి. సైన్యంలో మానవ వనరులు, మౌలిక వసతులను గరిష్ఠ స్థాయిలో వినియోగించడం, యాంత్రీకరణ వంటి అంశాల పైనా కమాండర్లు చర్చించారు.

ఇదీ చూడండి:15వ ఆర్థిక సంఘం నివేదిక సిద్ధం

ABOUT THE AUTHOR

...view details