అసోంలో కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్న అవసరాలకు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ దుర్భర పరిస్థితుల మధ్య ఓ గర్భిణి ప్రసవానికి వైద్య సిబ్బంది సాయమందించారు. ఆసుపత్రికి నాటు పడవలో తీసుకెళుతుండగా మధ్యలోనే మగ శిశువును ప్రసవించింది.
గోలాఘాట్ జిల్లా బోకాఖాట్లో ఈ ఘటన జరిగింది. ఆశా కార్యకర్త మంజు ఛెత్రి అక్కడే ఉండటం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రసవం తర్వాత అదే పడవలో బోకాఖాట్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.