తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ-150: దారులు వేరైనా సిద్ధాంతాలు ఒకటే! - gandhi and tagore

విశ్వకవి రవీంద్రనాథ్​ ఠాగూర్​, మహాత్మ గాంధీ... పరిచయం అక్కర్లేని మార్గనిర్దేశకులు. ఎంతో మందిని తమ ఉద్యమాలు, రచనలతో ప్రభావితం చేశారు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, సారూప్యతలు అనేకం ఉన్నాయి. ఆధునికీకరణ పేరుతో పాశ్చాత్య సంస్కృతిని దేశంపై రుద్దడానికి వ్యతిరేకంగా నిలిచి పోరాడారు. దేశ భవిష్యత్తు గ్రామాల స్వరాజ్యం, సమాజంపైనే ఆధారపడి ఉంటుందని నమ్మారు.

దారులు వేరైనా సిద్ధాంతాలు ఒకటే

By

Published : Sep 6, 2019, 7:01 AM IST

Updated : Sep 29, 2019, 2:52 PM IST

స్వయం ప్రకటిత పురోగతి పేరుతో ఆధునికీకరణ ఆలోచన ప్రభావం సాంస్కృతిక, రాజకీయ రంగాలపై పడింది. ఈ అంశం వివిధ భావజాలాలకు చెందిన మేధావుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ఆధునికీకరణ కోసం పాశ్చాత్య పోకడలను అనుసరించటాన్ని మహాత్మగాంధీ, విశ్వకవి రవీంద్రనాథ్​ ఠాగూర్​ వ్యతిరేకించారు. సంస్కృతి, సంప్రదాయాలను తనలో కలిపేసుకుని.. నైతిక, సామాజిక సాపేక్షతను వదిలేసి.. సార్వత్రికవాదాన్ని పాశ్చాత్య ప్రభావం ప్రశ్నార్థకం చేస్తుందని ఆరోపించారు.

గాంధీ, ఠాగూర్​ మధ్య చరఖా ఉద్యమం విషయంలో జరిగిన చర్చలను గమనిస్తే కొన్ని సారూప్యతలు కనిపిస్తాయి. ఠాగూర్​ 'స్వదేశీ సమాజ్' భావజాలం గాంధీ సూచించిన గ్రామీణ స్వరాజ్​కు చక్కగా సరిపోతుంది. అయితే జాతీయవాదం, సాంస్కృతిక మార్పిడి, రోజువారీ జీవితంలో శాస్త్ర సాంకేతిక​తల పాత్ర అంశాల్లో మాత్రం ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండేవి.

ఇదీ చూడండి: గాంధీ 150: స్వతంత్ర సంగ్రామానికి సాక్షి 'జెండా పార్క్'

జాతీయవాదానికి సంబంధించి ఠాగూర్​ అతివాద లక్షణాలను నమ్మేవారు. 1917లో జాతీయవాదంపై ఠాగూర్​ ఇచ్చిన ప్రసంగాల్లో పాశ్చాత్య పోకడలపై తీవ్రంగా మండిపడ్డారు. తీవ్రవాద జాతీయవాదానికి ఠాగూర్​ దూరంగా ఉన్నా.. అమిత దేశభక్తి పేరుతో జాతీయవాదం విధ్వంసక రూపాన్ని ఏర్పరచుకుంది. 'ముక్తిధార'లో గాంధీ అహింసావాదాన్ని ఠాగూర్​ సమర్థించినా.. సహాయనిరాకరణ, చరఖా ఉద్యమాలకు ఠాగూర్​ మద్దతివ్వలేదు. విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించి స్వదేశీ వస్తువులనే వాడాలని సూచించారు గాంధీ. ఖాదీ వాడకం అనేది పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకంగా చేసే ఉద్యమం కాదని, వలస వాదాన్ని పారదోలే రాజకీయ సందేశమని మాత్రమే ఠాగూర్​ భావించేవారు.

ఒకానొక దశలో గాంధీ క్రమంగా పాశ్చాత్య సంస్కృతిని పూర్తిగా వ్యతిరేకించారు. నిత్యజీవితంలో ఐరోపా శాస్త్రీయ దృక్పథాన్ని నిరాకరించారు. ఠాగూర్​ మాత్రం ఐరోపావాదాన్ని వ్యతిరేకించినా శాస్త్రసాంకేతిక అంశాలను ఆమోదించారు.

వీరిద్దరూ భారతీయ సంస్కృతికి గ్రామాలే కేంద్రమని గట్టిగా నమ్మారు. ఈ విషయాన్ని హరిజన్​ వారపత్రికలో గాంధీ స్పష్టంగా తెలిపారు.

"దేశానికి గ్రామాలు పట్టు కొమ్మలు. ఒకవేళ గ్రామాలు కనుమరుగైతే భారత్​ ఉనికి కోల్పోతుంది. భారత్​ అనేది ఉండదు."

-మహాత్మ గాంధీ

ఇదే ఉద్దేశంతో 'గ్రామాల పునర్నిర్మాణం' కార్యక్రమాన్ని 1917లో చంపారన్, 1920లో సేవాగ్రామ్​, 1938లో వార్దాలో ప్రారంభించారు.

ఇదీ చూడండి: గాంధీ-నెహ్రూ బంధానికి రైల్వే స్టేషన్​లోనే బీజం!

ఠాగూర్​ కూడా భారత్​లో గ్రామాలను పునర్నిర్మించే ఉద్దేశంతో 'శ్రీనికేతన్​'ను ప్రారంభించారు. దేశీయ సాంస్కృతిక, ఆర్థిక విధానాలను వ్యవస్థాగతంగా ధ్వంసం చేస్తున్న వలసవాదానికి విరుగుడుగా ఈ విద్యాసంస్థను నెలకొల్పారు. దేశం మీద పాశ్చాత్య విధానాలను బలవంతంగా రుద్దడాన్ని బహిరంగంగా విమర్శించారు. ఇందుకు స్వదేశీ సమాజ్​ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఉద్యమం గాంధీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్​తో పోలి ఉంటుంది.

ఆధునికీకరణలో పాశ్చాత్య పోకడలను ఠాగూర్​, గాంధీ సవాలు చేయటమే కాదు.. దానికి ప్రత్యామ్నాయాలైన స్వదేశీ సమాజ్​, స్వరాజ్​ భావజాలాలను గట్టిగా నమ్మారు. స్వయం ఆధారితంగా, నైతిక బాధ్యత కలిగి సమాజంలో పరస్పర సహకారం ఉండాలని ఇద్దరూ నొక్కి చెప్పారు. సామరస్య సూత్రాలపైనే సమాజం ఆధారపడి ఉందని భావించారు. ఈ దృగ్విషయానికి ఠాగూర్​ మరో కొలమానాన్ని నిర్ధరించారు.

"సమాజ ఉద్దీపనకు భావోద్వేగం, ఆకాంక్ష ఎంత ముఖ్యమో అనుభావిక పరిశోధన, హేతుబద్ధమైన ఆలోచన కూడా అంతే అవసరం."

-రవీంద్రనాథ్ ఠాగూర్​, విశ్వకవి

(రచయిత- అర్నబ్​ ఛటర్జీ, సహాయ ఆచార్యులు, హరిశ్చంద్రపుర్​ కళాశాల, మాల్దా)

Last Updated : Sep 29, 2019, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details