సంక్రాంతి అంటే గుర్తుకువచ్చేది పతంగులు. ఆ పండుగ వేళ పిల్లలకు, పెద్దలకు పతంగులు ఎగురవేయటం అంటే ఎంతో సరదా. అయితే పటాలను ఎగురవేయడం వల్ల.. వాటి దారాలు తగిలి పక్షలు గాయపడటం.. తద్వారా చనిపోవడం పరిపాటిగా మారింది. అయితే ఈ సారి గాలిపటాల ద్వారా పక్షులకు హాని కలగకుండా వినూత్నంగా పతంగులను తయారు చేశారు గుజరాత్లోని సూరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్, టెక్నాలజీ విద్యార్థులు. పక్షులు భయపడే గుడ్లగూబ, గద్ద చిత్రాలతో గాలిపటాలను రూపొందించారు. వాటికి అల్లం, మిరియాల మిశ్రమాన్ని అంటించారు.
పతంగులపై గుడ్లగూబ, గద్ద చిత్రాలు-కారణం ఇదే! - గాలిపటాలు వివిధ చిత్రాలతో
సంక్రాంతిని పురస్కరించుకొని గుజరాత్లోని సూరత్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గుడ్లగూబ, గద్ద వంటి పక్షుల చిత్రాలతో పతంగులను తయారు చేశారు. ఆ గాలిపటాలకు అల్లం, మిరియాల మిశ్రమాన్ని సైతం కలిపి రూపొందించారు. ఇలా వినూత్నంగా పతంగులు చేయటానికి కారణం తెలుసుకుందామా..
ఈ గాలిపటాలను చూస్తే పక్షులు గూళ్లు దాటవు!
పక్షులకు గుడ్లగూబ, గద్దలను చూస్తే భయమని, అల్లం, మిరియాల మిశ్రమం వాసన వాటికి పడవని సంస్థ అధ్యాపకులు తెలిపారు. ఇలా చేయటం వల్ల పక్షులు బయటికి రావడానికి భయపడుతాయని, తద్వారా గాయపడే అవకాశం ఉండదని వివరించారు.
ఇదీ చదవండి :ఎలాంటి ప్రమాదకర వ్యాధులైనా 'మడ్ థెరపీ'తో నయం