తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరుబయటకు చెంబు పట్టుకెళితే.. రేషన్​ కట్​ - ఒడిశా గంజాంలో బహిరంగంగా మలవిసర్జన చేసినందుకు గ్రామంలోని 24 కుటుంబాలకు రేషన్ రద్దు

సాధారణంగా గ్రామ సర్పంచ్​.. గ్రామస్థులకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేయాలి. కానీ, ఓ గ్రామ సర్పంచ్​ మాత్రం దగ్గరుండి 24 కుటుంబాలకు రేషన్​ రద్దు చేయించారు. మరోసారి బహిరంగంగా ఆ పని చేయకుండా ఉండేలా ఈ విధంగా మందలించాడు.

ఆరుబయటకు చెంబు పట్టుకెళితే.. రేషన్​ కట్​

By

Published : Nov 2, 2019, 4:02 PM IST

Updated : Nov 2, 2019, 8:24 PM IST

ఆరుబయటకు చెంబు పట్టుకెళితే.. రేషన్​ కట్​
పరిసరాలు, ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించుకోవాలని గట్టిగానే చెబుతున్నారు ఓ సర్పంచ్​. ఒడిశా గంజాం జిల్లాలో బహిరంగంగా మలవిసర్జన చేసినందుకు గ్రామంలోని 24 కుటుంబాలకు రేషన్ రద్దు చేశారు సుశాంత్ స్వైన్​.

ఈటీవీ భారత్​ కథనం ప్రకారం... అక్టోబర్ 27, 28 తేదీల్లో సంఖేముండి పరిధిలోని గౌతమిలో జాతీయ, రాష్ట్ర ఆహార భద్రతా చట్టాల కింద నెలవారీ రేషన్​ను పంపిణీ చేశారు. ఆ 24 కుటుంబాలకు మాత్రం రేషన్​ ఇచ్చేందుకు నిరాకరించారు స్వైన్. మరోసారి పునరావృతం కావద్దని సున్నితంగా మందలించారు.

అయితే, తమ పంచాయితీ స్వచ్ఛభారత్​కే ఆదర్శంగా ఉండాలని గ్రామంలోని మహిళా సంఘాలు కలిసి దారి పొడవునా తులసి మొక్కలు నాటారు. తులసిని ఎంతో పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఈ మొక్కలు ఉన్న ప్రదేశంలో పాడు పనులు చేయకూడదని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:బడి పిల్లల పొలం బాట- సర్కార్​ వైఖరే కారణం!

Last Updated : Nov 2, 2019, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details