తెలంగాణ

telangana

ETV Bharat / bharat

51 మంది కేంద్ర మంత్రులు కోటీశ్వరులే - కోటీశ్వరులు

కేంద్ర మంత్రివర్గంలోని 51 మంది మంత్రులు కోటీశ్వరులేనని అసోసియేషన్​ ఫర్​ డెమోక్రాటిక్​ రీఫామ్స్(ఏడీఆర్​) సంస్థ​ వెల్లడించిన నివేదికలో తేలింది. 22 మందిపై క్రిమినల్​ కేసులున్నట్లు తెలిపింది ఏడీఆర్​.

51 మంది కేంద్ర మంత్రులు కోటీశ్వరులే

By

Published : Jun 1, 2019, 6:42 AM IST

91 శాతం కేంద్ర మంత్రులు కోటీశ్వరులే

కేంద్ర మంత్రులుగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన 56 మంది మంత్రులలో 51 మంది (91 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్​ ఫర్​ డెమోక్రాటిక్​ రీఫామ్స్​ సంస్థ తెలిపింది.

సగటున ఒక మంత్రికి రూ. 14.72 కోట్ల ఆస్తులున్నట్లు తన నివేదికలో వెల్లడించింది ఏడీఆర్​.

  1. హోం మంత్రి అమిత్​ షా, రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​, హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ సహా నలుగురు మంత్రుల ఆస్తులు రూ. 40 కోట్లకు పైనే.
  2. కైలాశ్​ చౌదరి, రమేశ్వర్​ తేలి సహా ఐదుగురు మంత్రుల ఆస్తి రూ. కోటికి తక్కువే.
  3. ఒడిశా బాలాసోర్​ ఎంపీ ప్రతాప్​ చంద్ర సారంగి ఆస్తి.. రూ. 13 లక్షలు మాత్రమే.

ఎన్నికల్లో పోటీ సందర్భంగా.. మంత్రులు ఈసీకి సమర్పించిన ప్రమాణపత్రాలను పరిశీలించిన ఏడీఆర్​ ఈ వివరాలు వెల్లడించింది.

'47 మంది మంత్రులు తాము పట్టభద్రులమని.. 8 మంది 10-12 తరగతుల వరకే చదువుకున్నట్లు' అఫిడవిట్​లో వెల్లడించారని సంస్థ స్పష్టం చేసింది. ఒక కేంద్ర మంత్రి డిప్లొమాను విద్యార్హతగా పేర్కొన్నట్లు తెలిపింది.

కేంద్ర మంత్రులు లోక్​ జన్​శక్తి పార్టీ అధ్యక్షుడు రాం విలాస్​ పాసవాన్​, జై శంకర్​లు పార్లమెంట్​ సభ్యులు కానందున వారి వివరాలు తెలియరాలేదు.

16 మందిపై తీవ్ర నేరారోపణలు...

56 మంది మంత్రుల్లో 22 మందిపై (39 శాతం) క్రిమినల్​ కేసులున్నాయి. గత లోక్​సభతో పోలిస్తే ఇది 8 శాతం అధికం.

16 మందిపై తీవ్ర నేరారోపణలు నమోదయ్యాయి.

వీరిపై హత్యాయత్నం, మతవిద్వేషాల్ని రెచ్చగొట్టడం, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన వంటి కేసులున్నాయి.

ఇదీ చూడండి:

నమో 2.0: నవ భారత నిర్మాణానికి 'జల్​శక్తి'

ABOUT THE AUTHOR

...view details