కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవాలంటే సామాజిక దూరం తప్పనిసరి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధించింది ప్రభుత్వం. ఆంక్షల అమలు కోసం ఉన్నత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయినా కొందరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది మహారాష్ట్రలోని ఓ గ్రామం. సరైన కారణం లేకుండా బయటకొచ్చేవారిని గాడిదపై ఊరేగించాలని తీర్మానించింది.
మహారాష్ట్ర బీడ్ జిల్లా కేజ్ మండలంలోని తకలి గ్రామ ప్రజలంతా కలిసి మార్చి 29న ఈ తీర్మానం చేశారు.