జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాద సంబంధిత ఘటనలు పెరిగిపోతున్నాయి. జమ్ము కశ్మీర్ పోలీసుల గణాంకాల ప్రకారం 2018 ఆగస్టు 5 నుంచి 2020 సెప్టెంబర్ 30 నాటికి ఉగ్ర ఘటనలు 9.6 శాతం పెరిగాయి. అదే సమయంలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య 11.30 శాతం పెరిగింది.
"2018 ఆగస్టు నుంచి 2019 సెప్టెంబర్ మధ్య 198 ఉగ్ర సంబంధిత ఘటనలు జరిగాయి. ఇందులో 292 మంది ఉగ్రవాదులు, 118 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో 66 మంది పౌరులు మరణించారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో 217 ఉగ్ర సంబంధిత ఘటనలు జరిగాయి. ఇందులో 325 మంది ఉగ్రవాదులు, 88 మంది భద్రతా సిబ్బంది, 67 మంది పౌరులు ప్రాణాలు విడిచారు."
-జమ్ము కశ్మీర్ పోలీసు శాఖ గణాంకాలు
గతంతో పోలిస్తే పౌరుల మరణాలు 1.52 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే భద్రతా దళాల మరణాలు మాత్రం 25.42 శాతం తగ్గుముఖం పట్టాయి.