తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీసు అధికారిణి గుండు వెనుక క్యాన్సర్​ కథ! - lady police officer donates her hair to cancer patients

అతివలకు కురులు సహజాభరణం. అలంకరణ ప్రియులైన అమ్మాయిలు.. కేశాల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. అలాంటిది జుట్టును మొత్తంగా కత్తిరించుకోవాలంటే ధైర్యం వస్తుందా?  కానీ, ఓ మహిళ మాత్రం ఓ గొప్ప సంకల్పంతో తన జట్టును క్యాన్సర్​ బాధితులకు విరాళంగా ఇచ్చేశారు.

పోలీసు అధికారిణి గుండు వెనుక క్యాన్సర్​ కథ!

By

Published : Oct 1, 2019, 5:32 AM IST

Updated : Oct 2, 2019, 5:01 PM IST

పోలీసు అధికారిణి గుండు వెనుక క్యాన్సర్​ కథ!
నాలుగు వెంట్రుకలు రాలిపోతేనే బెంగపెట్టుకుంటాం. మరి క్యాన్సర్​ వ్యాధి బారిన పడి జుట్టునంతా పోగొట్టుకునేవారి పరిస్థితి ఊహించుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది. అందుకే కేరళ త్రిస్సూర్​లోని ఇరింజలకుడాకు చెందిన మహిళా రూరల్​ పోలీస్​ స్టేషన్​లో పని చేస్తున్న పోలీస్​ అధికారిణి అపర్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
పోలీసు అధికారిణి గుండు వెనుక క్యాన్సర్​ కథ!

క్యాన్సర్​తో పోరాడుతున్న 5వ తరగతి విద్యార్థిని కలిశాక అపర్ణ తన కేశాలు క్యాన్సర్ బాధితులకు విగ్గులు తయారు చేసే సంస్థకు ఇవ్వాలనుకున్నారు. వెంటనే త్రిస్సూర్​లోని అమల ఆసుపత్రిలో ఆమె కురులను దానం చేశారు. అందం అనేది బాహ్య సౌందర్యంలోనిది కాదని.. మనం చేసే ప్రతి పని, ప్రతి మాటలో కనిపించాలంటారు అపర్ణ.

గతంలో తమ చిన్నారికి చికిత్స చేయించాలని ఓ పేద కుటుంబం అపర్ణను ఆశ్రయించింది. వెంటనే తన చేతికున్న బంగారు గాజులను తీసి వారికి ఇచ్చారు అపర్ణ. మానసిక అందాన్ని చాటిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అపర్ణకు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

ఇదీ చూడండి:పదేళ్ల నిరుపేద చిన్నారికి ప్రాణాంతక క్యాన్సర్​

Last Updated : Oct 2, 2019, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details