తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భళారే బాటిల్​ గోడ.. ఇక తగ్గుతుంది ప్లాస్టిక్​ పీడ - బాటిల్​ గోడ కర్ణాటక మంగళూరు

చారిత్రక ఏక శిలా కట్టడాలు, మట్టి గోడలు, అద్దాల మేడలు ఇలా తరతరాలుగా ఎన్నో కట్టడాలను చూసి ఉంటారు. కానీ, ఈ కొత్త రకం కట్టడాన్ని మాత్రం మీరు ఎక్కడా చూసి ఉండరు. అవును, కర్ణాటకలో పనికిరాని ప్లాస్టిక్​ బాటిళ్లతో నిర్మితమవుతున్న ప్రహారీ గోడ ఇప్పుడే ట్రెండ్​ అవుతోంది మరి!

In karnataka Subrahmanya Mangalore district The PDO Muttappa has constructing Wall by dead duck plastic Bottles
భళారే బాటిల్​ గోడ.. ఇక తగ్గుతుంది ప్లాస్టిక్​ పీడ

By

Published : Dec 11, 2019, 6:47 AM IST

భళారే బాటిల్​ గోడ.. ఇక తగ్గుతుంది ప్లాస్టిక్​ పీడ

కాస్త సృజనాత్మక జోడిస్తే.. అద్భుతాలు సృష్టించవచ్చని మరోసారి నిరూపించాడు కర్ణాటక మంగళూరుకు చెందిన ముత్తప్ప. పర్యావరణాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్​ వ్యర్థాలను పద్ధతి ప్రకారం కూర్చి.. అందమైన ప్రహారీ గోడను నిర్మిస్తున్నాడు.

మంగళూరులోని కుక్కే సుబ్రమణ్య ఆలయానికి రోజూ వందలాది మంది భక్తులు వస్తుంటారు. వారంతా ప్లాస్టిక్​ నీళ్ల సీసాలు కొనుగోలు చేసి.. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడే పడేస్తారు. తెల్లారేసరికి అవి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయేవి. పారిశుద్ధ్య విభాగం వారు చెత్తను తీసుకెళ్లి కాల్చేస్తారు. అందులో ఈ ప్లాస్టిక్ బాటిళ్ల కారణంగా వెలువడే విషపూరిత పొగ అంతా ఇంతా కాదు.

కాదేదీ గోడకు అనర్హం..

ఏళ్లు గడిచినా భూమిలో కరిగిపోని ఈ బాటిళ్లను నివారించడం ఎలా అని ఆలోచించాడు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి ముత్తప్ప. ప్లాస్టిక్​తో ఎన్నో వస్తువులు తయారు చేస్తున్నాం.. ఓ గోడను కడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. సేకరించిన బాటిళ్లను కాల్చివేయకుండా, కుప్పలుగా వేయకుండా క్రమపద్ధతిలో పేర్చి ఎలా గోడను నిర్మించాలో ఇంటర్​నెట్​లో చూశాడు.

వేలకు వేలు పోసి ఇటుకలు కొనే బదులు.. ఇసుక, బురదను పనికిరాని నీళ్ల బాటిళ్లలో నింపి ఎంచక్కా దృఢమైన, మన్నికైన ప్రహారీ గోడను నిర్మించుకోవచ్చని పంచాయతీలో ప్రతిపాదించాడు. ముత్తప్ప పర్యావరణహిత ఆలోచనను ఉన్నత అధికారులు, గ్రామ ప్రజలు ఆమోదించారు.

ఇంకేముంది.. బాటిల్​ వాల్​ను చకచకా నిర్మించేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఈ ప్రహారీ పూర్తయ్యాక చూసేందుకు వినూత్నంగానూ, ప్రయోజనకరంగానూ ఉంటుందని చెబుతున్నాడు ముత్తప్ప.

ఇదీ చదవండి:'వేలం పాడండి.. ఎన్నికలు లేకుండా పదవులు పొందండి!'

ABOUT THE AUTHOR

...view details