తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక స్థానిక పోరులో హస్తం హవా....

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్​ సత్తా చాటింది. లోక్​సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే జరిగిన 'పురపాలక' పోరులో అధిక స్థానాల్లో గెలుపొందింది హస్తం పార్టీ. భాజపా రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సంకీర్ణ కూటమిలో ఉన్న కాంగ్రెస్​, జేడీ(ఎస్​) వేర్వేరుగా పోటీచేయడం విశేషం.

కర్ణాటక స్థానిక పోరులో హస్తం హవా....

By

Published : Jun 1, 2019, 5:15 AM IST

కర్ణాటక స్థానిక పోరులో హస్తం హవా....

కర్ణాటక పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ పుంజుకుంది. ఇటీవలి ముగిసిన లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఈ ఫలితాలు ఆ పార్టీకి ఊరటనిచ్చేవే.

56 పురపాలక సంఘాల పరిధిలోని 1221 వార్డులకు గాను కాంగ్రెస్​ 509 స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 366 చోట్ల నెగ్గి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్​, జేడీ(ఎస్​)లు ఈ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేయడం గమనార్హం. జేడీ(ఎస్​) 174 వార్డుల్లో గెలుపొందింది. 160 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో కలిసి పోటీచేసిన కాంగ్రెస్​, జేడీ(ఎస్​) చెరో సీటు మాత్రమే నెగ్గాయి.

  • 7 నగర పాలికల్లోని 217 డివిజన్లకుగాను కాంగ్రెస్‌ 90 స్థానాలు గెల్చుకుంది. భాజపా 56, జేడీ(ఎస్‌) 38 వార్డుల్లో విజయం సాధించాయి.
  • 30 పట్టణ పురపాలికల పరిధిలోని 714 వార్డులకుగాను 322 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. భాజపా 184, జేడీ(ఎస్‌) 102 వార్డుల్లో విజయంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • 19 నగర పంచాయతీల పరిధిలో 290 వార్డులకు జరిగిన ఎన్నికల్లో భాజపా అధిక సీట్లు సాధించింది. అత్యధికంగా 126 స్థానాల్లో గెలిచింది కాషాయ పార్టీ. కాంగ్రెస్​, జేడీ(ఎస్​) వరుసగా 97, 34 సీట్లు సాధించి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

సార్వత్రిక పోరులో బోల్తా...

కర్ణాటక వ్యాప్తంగా మే 29న ఈ ఎన్నికలు నిర్వహించారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో స్థానిక నాయకత్వం మధ్య సమన్వయ లోపంతో ఇక్కడ సంకీర్ణ కూటమి విఫలమైంది. 28 లోక్​సభ స్థానాల్లో భాజపా 25 గెల్చుకుంది. కాంగ్రెస్​, జేడీ(ఎస్​) ఒక్కో సీటును నెగ్గాయి.

ఈ ఎన్నికల ఫలితాలు ఓటర్ల నాడికి నిదర్శనమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. పట్టున్న చోట్ల భాజపా గెలిచిందని తెలిపారు ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప. రాష్ట్రంలో స్థానిక స్థాయిలో పార్టీ బలంగా ఉందని నిరూపితమైనట్లు పేర్కొన్నారు రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు దినేశ్​ గుండురావు.

గతేడాది 105 పురపాలక సంఘాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ 982 వార్డుల్లో గెలిచింది. భాజపా, జేడీ(ఎస్​) 929, 375 స్థానాలతో నిలిచాయి.

ABOUT THE AUTHOR

...view details