తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆఫ్రికాలో వరుడు.. భారత్​లో వధువు.. నెట్టింట పెళ్లి - Rajasthan

కరోనా కారణంగా కార్యకలాపాలన్నీ ఆన్​లైన్​ ద్వారా సాగుతున్నాయి. డిజిటల్​ క్లాసులు​, వర్చువల్​ మీటింగ్​లు, వర్క్ ఫ్రమ్​ హోమ్ మాత్రమే కాదు.. ఇటీవల పెళ్లిళ్లూ వర్చువల్​గానే జరుగుతున్నాయి. ఇదే తరహాలో రాజస్థాన్​కు చెందిన నవదంపతులు వీడియోకాల్​ ద్వారా ఒక్కటయ్యారు.

In different continents,
వీడియో కాల్​ ద్వారా పెళ్లి చేసుకుంటున్న దృశ్యం

By

Published : Jun 30, 2020, 7:44 PM IST

వధూవరుల మధ్య వేలాది కిలోమీటర్ల దూరం ఉన్నా వారి పెళ్లికి ఆటంకం కలగలేదు. కరోనా మహమ్మారి ఆంక్షలూ అడ్డుకోలేదు. ఇప్పట్లో వైరస్​ తగ్గే పరిస్థితులు కనిపించక.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వధూవరులు.. వినూత్నంగా ఆలోచించారు. వర్చువల్​గా ఒక్కటయ్యారు. వరుడు దక్షిణాఫ్రికాలో ఉండగా, వధువు రాజస్థాన్​లోని ఓ గ్రామంలో ఉండి తమ పెళ్లి తంతును పూర్తి చేశారు.

ఆన్​లైన్​లో​ పెళ్లి

రాజస్థాన్​లోని దంగర్​పుర్​ జిల్లా ధంభోల గ్రామానికి చెందిన మార్కండేయ త్రివేది దక్షిణాఫ్రికాలో అకౌంటెంట్​గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన రుచా పాండ్యతో ఆరు నెలల క్రితం వివాహం నిశ్చయించారు పెద్దలు. జూన్​ 29న ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పనులు ప్రారంభించారు. కానీ, కరోనా రక్కసి వారి పనులకు అడ్డుతగిలింది. ముహూర్తం నాటికి వైరస్​ తగ్గిపోతుందని భావించారు. కానీ అలా జరగలేదు. లాక్​డౌన్​తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. ముహూర్తం సమయానికి దక్షిణాఫ్రికాలో ఉన్న త్రివేది వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. దాంతో ఇరుపక్షాలు ఆలోచించి వర్చువల్​గా పెళ్లిచేయాలని నిర్ణయించారు.

వధువుతో పాటు ఇరు కుటుంబాల పెద్దలు న్యాయవాది సమక్షంలో వీడియో కాల్​ ద్వారా వివాహం పూర్తి చేశారు. అనంతరం నిర్వహించే పూజాకార్యక్రమాల కోసం అత్తవారింటికి వెళ్లింది నవవధువు.

ఇదీ చూడండి: భార్య బొట్టు పెట్టుకోలేదని విడాకులిచ్చిన భర్త

ABOUT THE AUTHOR

...view details