దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా పరాజయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలపై తన అంచనా తప్పిందన్నారు. గెలుపోటముల కోసం ఎన్నికల్లో తలపడలేదన్న ఆయన.. తమ భావజాలాన్ని విస్తరించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్పారు. దిల్లీ ఎన్నికల ఫలితాలు సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ప్రజలు ఇచ్చిన తీర్పుకాదన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమ పార్టీ నాయకులు కొందరు ‘గోలీమారో, ఇండో-పాక్ మ్యాచ్’ వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రకటనలు భాజపాకు నష్టం చేసి ఉండొచ్చన్నారు.
దిల్లీలో అందుకే ఓడిపోయామేమో : అమిత్ షా - దిల్లీలో అలాంటి ప్రకటనలే వల్లే భాజపాకు ఓటమి: షా
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమిపై స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ ఎన్నికల్లో తమ అంచనా తప్పిందన్నారు. గోలీమారో, ఇండో-పాక్ మ్యాచ్ వంటి వ్యాఖ్యల వల్లే భాజపాకు నష్టం కలిగి ఉండొచ్చన్నారు.
దిల్లీలో అలాంటి ప్రకటనలే వల్లే భాజపాకు ఓటమి: షా
కాంగ్రెస్ పార్టీయే ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించిందని అమిత్ షా ఆరోపించారు. సీఏఏ సంబంధిత అంశాలపై ఎవరైనా తనతో మాట్లాడాలనుకుంటే తన కార్యాలయం వద్ద సమయం తీసుకోవచ్చన్నారు. వారికి మూడు రోజుల్లో సమయం కేటాయిస్తామని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందన్నారు.
ఇదీ చూడండి:'నేర చరిత్ర' తీర్పుపై భాజపాకు ఎక్కుపెట్టిన కాంగ్రెస్
Last Updated : Mar 1, 2020, 6:09 AM IST