తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇస్మార్ట్​ దొంగలు​.. నిమిషాల్లో దోచారు రెండు లక్షలు​! - petrolbunk

ఓ పెట్రోల్​బంక్​లో జరిగిన దొంగతనం.. సినిమాను తలపించింది. ముఖానికి ముసుగు ధరించి బైక్​లపై వచ్చిన నలుగురు దుండగులు... బంక్​ సిబ్బందికి చుక్కలు చూపించారు. తుపాకీలతో బెదిరించి సునాయాసంగా రెండు లక్షల రూపాయలు లూటీ చేశారు.

ఇస్మార్ట్​ దొంగలు​.. నిమిషాల్లో దోచారు రెండు లక్షలు​!

By

Published : Sep 7, 2019, 1:48 PM IST

Updated : Sep 29, 2019, 6:31 PM IST

ఇస్మార్ట్​ దొంగలు​.. నిమిషాల్లో దోచారు రెండు లక్షలు​!

బిహార్​ హాజీపుర్​లోని హిలాల్​పుర్​ చౌక్​ వద్ద ఓ పెట్రోల్ ​బంక్​లో చొరబడ్డ దుండగులు రెండు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.

హెల్మెట్లు, ముసుగులు ధరించి రెండు ద్విచక్ర వాహనాలపై దర్జాగా వచ్చారా నలుగురు. తమతో తెచ్చుకున్న తుపాకీలు తీసి బంక్​ సిబ్బందిని బెదిరించారు. క్యాష్​ కౌంటర్​​ గదిలోకి తీసుకెళ్లమని దౌర్జన్యం చేశారు. సిబ్బంది నోరు మెదిపితే కొట్టి, తలపై తుపాకీ పెట్టి హడలెత్తించారు. మరో ఇద్దరు.. కౌంటర్​లో ఉన్న డబ్బును తమ సంచిలో వేసుకున్నారు. సిబ్బంది జేబులో ఉన్న చిల్లరనూ వదలకుండా మొత్తం రెండు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.

ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సిబ్బంది ఫిర్యాదు మేరకు దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

ఇదీ చూడండి:ఏటా రెండు సార్లే నడిచే రైలు.!

Last Updated : Sep 29, 2019, 6:31 PM IST

ABOUT THE AUTHOR

...view details